ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. ఇలా ప్రజల్లో ఆదరణ పొందుతూ.. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ జగన్ తన పాదయాత్రను చేస్తున్నారు. జగన్‌లో వచ్చిన రాజకీయ పరిణితిని గమనించిన రాజకీయ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసిన పలువురు సీనియర్ నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత టీడీపీ నేత సాయిప్రతాప్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రపై పొగడ్తల వర్షం కురిపించారు. జగన్ మోహన్‌రెడ్డి ఓ డైనమైట్ అని, ఏ నాయకుడు చేయని విధంగా జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలు విన్న పలువురు టీడీపీ నాయకులు సాయి ప్రతాప్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, అందులో భాగంగానే ఇలా జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని చర్చించుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో ఉన్న చంద్రబాబు ఏపీకి రాగానే సాయి ప్రతాప్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.