టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం భరత్ అను నేను. మహేష్ అభిమానులకు రిపబ్లిక్‌డే కానుకగా వినూత్న ప్రచారంలో భాగంగా ఈ ఉదయం 7 గంటలను ఫస్ట్ వోథ్ పేరుతో ఈ మూవీ నుండి మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాయిస్ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. జస్ట్ ఆ వాయిస్ టీజర్లో మహేష్ ప్రమాణ స్వీకారం దేవీ శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ అదిరిపోయిందనే చెప్పొచ్చు.
ఇక భరత్ అను నేనులో మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం డైలాగ్స్ విషయానికి వస్తే.. భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన. భారత రాజ్యాంగం పట్ల. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని.. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ మహేష్ ఫస్ట్ వోథ్‌తో సంచలన ఆడియోతో వచ్చేశాడు మహేష్ బాబు.