ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు హయంలో గాంధీ కుటుంబానికి అవమానం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.ఈ రోజు శుక్రవారం దేశ వ్యాప్తంగా అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగాజరుగుతున్నాయి.అందులో భాగంగా మొదటిగా భారతరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యావత్తు భారతజాతికి సందేశాన్ని కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఎంతో హట్టహసంగా జరుగుతున్నాయి.అయితే ఈ వేడుకల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పది దేశాల ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వేదికపై గత డెబ్బై ఏళ్ళ చరిత్రలో అతిఎక్కువగా పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి వేదికపై నాలుగో వరసలో సీటు కేటాయించడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.దీంతో మోదీ నేతృత్వంలో గాంధీ కుటుంబానికి ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి అని విమర్శలు చేస్తున్నారు.