2014 ఎన్నికల్లో కడప జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీలోకి వెళ్లి ఎవరూ ఊహించని విధంగా మంత్రి పదవిని కొట్టేశారు ఆదినారయణ రెడ్డి. కేశవరెడ్డి కేసులన్నీ రాజకీయ పరిధిని దాటి కోర్టు పరిధికి చేరుకోవడంతో తన వియ్యంకుడిని బయటపడవేయడానికి ఆది నారాయణ రెడ్డి టీడీపీలోకి వస్తున్నాడని .. తెలుగుదేశంలోకి రాకను వ్యతిరేకిస్తున్నానని ఆనాడే టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలు చేసే వారిని తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. అధికారంలో ఉన్న పార్టీవైపు వెళ్లడం ఆదినారాయణకు అలవాటేనని ఎద్దేవా చేశారు. అసలు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయన వల్లే టీడీపీ అన్ని విధాలా నష్టపోయిందని ఆరోపించారు. అయిన చంద్రబాబు ఆదినారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకొవడమేగాక మంత్ర పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నా కూడా వీరిమధ్య సయోధ్య కుదరలేదు. అయితే ఇటీవల ఎస్సీలపై చేసిన వాఖ్యలు తెలుగు రాష్ర్టాల్లో తీవ్ర ధూమారం రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫ్యాక్షనిజం, రౌడీయిజం, టీడీపీ నేతల్లోనే ఆదినారయణ రెడ్డిపై తీవ్ర వ్యతీరేకత ఉండడంతో వచ్చే ఎన్నికల్లో గెలవడం డౌటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తాజాగా జరిగిన లేటేస్ట్ సర్వే అయితే 2019 ఎన్నికల్లో మాత్రం డిపాజిట్ల్ కూడ కఫ్టమే అని తెలిపింది.