ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ నిప్పులు చెరిగారు. పక్క ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై, ప్రత్యేక హోదాపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై మండిపడ్డారు. 2014 ఎననికల్లో మాయ మాటలు చెప్పి, ప్రజలను వంచించి గెలిచిన చంద్రబాబు 2019 ఎన్నికల్లోనూ అవే మాయ మాటలు చెప్పి.. బీజేపీతో పొత్తు పెట్టుకుని మోసపోయామని.. ఏపీ ప్రజల ముందు మళ్లీ కన్నీరు కార్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ఎద్దేవ చేశారు.
ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు మీ ఇంటి సమస్య కాదు.. రాష్ట్ర ప్రజల జీవనాడికి సంబంధించిన సమస్య, ఈ రెండు విషయాల్లో జరుగుతున్న వ్యవహారాలపై మీరు నోరు మెదపాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో తెత్తుకు తిరగగలవా..? సిగ్గులేదా..? అంటూ చంద్రబాబు తీరుపై ఉండవల్లి అరున్‌ణ్‌కుమార్ నిప్పులు చెరిగారు.