తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చెప్పడానికి నిదర్శమైన సంఘటన.గత అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించి నీళ్ళు నిధులు ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంవారికి దక్కకుండా చేయడమే కాకుండా ఈ ప్రాంత సహజవనరులను వలసపాలకులు దోచుకుంటుంటే వాటాలు పంచుకొని మరి మౌనంగా ఉన్న ఆ పార్టీ నేతలపై తెలంగాణ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో పూస గుచ్చినట్లు చెప్పే విధంగా జరిగిన ఘటన.
అసలు విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల మండలంలోని వరికోల్ గ్రామంలో మంగళవారం రాత్రి పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రామిరెడ్డి గ్రామంలోని కానాల మదూకర్ ఇంటి సమీపంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని వెళ్ళుతుండగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఇనగాల గొ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.దాదాపు ఇరవై నిమిషాల పాటు ఇనగాల గో బ్యాక్ బ్యాక్ అంటూ ఇనగాల ను దగ్గర ఉండి మరి ఊరి పొలిమేరను దాటేంత పని చేశారు .
అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ పలు పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలు ఎలా తిరగబడతారో చెప్పడానికి ఇది నిదర్శనం అని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దాదాపు పద్నాలుగు యేండ్ల పాటు కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ వైపు పరుగులు పెట్టిస్తున్నాటీఆర్ఎస్ సర్కారుపై అసత్య ఆరోపణలు చేస్తే ఇలాగె ప్రజలు తిరగబడతారు అనే విషయాన్నీ ప్రతిపక్షాలు గుర్త