ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంటే మరోవైపు ఆ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలల్లో మాత్రం చెరగని ముద్రవేసుకుంటున్నారు .గత నాలుగు ఏండ్లుగా తమకు పెన్షన్లు ,పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడి ఋణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో తమకు దేవుడైన నారా చంద్రబాబు నాయుడుకి గుడి కట్టిస్తామని హిజ్రాల సంఘం నాయకుడు విజయ్ కుమార్ అన్నారు .
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాకు దేవుడు .ఆయన మా గుండెల్లో కొలువై ఉన్నాడు .ఆయనకు గుడి కట్టించాలని నిర్ణయించుకున్నాం ..ఆ గుడిలో దాదాపు పదికిలోల బరువున్న బాబుగారి వెండి విగ్రహాన్ని ఉంచుతాం .దీన్ని అభిరుచి మధు మొత్తం ఐదు లక్షల రూపాయలతో చేయిస్తున్నారు .
ఇంకా దీనికి సంబంధించి డబ్బులు అవసరమైతే అర ఎకరం భూమి అమ్మైనా సరే ఆయనకు గుడి కట్టి తీరుతాం అని నంద్యాల లో మీడియాతో మాట్లాడారు విజయ్ ..అయిన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రస్తుతం తరుణంలో అదేదో సామెత ఉన్నట్లు హిజ్రాల మనస్సు దోచుకోవడం బాబుగారి పాలనకు నిదర్శనము అనుకోవాలేమో ..?