తెలుగు బుల్లితెర బిగ్ డ్యాన్స్ షో తాజా సీజన్ హోరా హోరీగా జరుగుతోంది. ఇక ఆ షోలో డ్యాన్స్ మాస్టర్స్ చేస్తున్న డ్యాన్స్ వావ్ అనిపించేలా ఉండగా మధ్య మధ్యలో టీమ్ లీడర్స్ చేసే కామెడీ మాత్రం విమర్శలకు గురి అవుతోంది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. సుధీర్, వర్షిణి ఒక టీమ్, రష్మీ, హేమంత్ మరొక టీమ్‌కు లీడర్స్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్‌లో రష్మీ టీమ్ గెలవగా… రష్మీ అండ్ కో స్టేజ్ పైనే డ్యాన్స్ చేయగా.. వర్షిణి డాన్స్ చేసింది. దీంతో సుధీర్ నువ్వు ఎవరి టీమ్, వాళ్లు గెలిస్తే నువ్వేంటి తెగ ఊపుతున్నావని సుధీర్ వర్షిణీని అడగ్గా… గత రెండు ఎపిసోడ్ల నుండి నువ్వు రష్మీ..రష్మీ..రష్మీ అంటూ ఊగిపోయినప్పుడు లేదా అంటూ కౌంటర్ ఇచ్చింది.
దీంతో సుదీర్ నువ్వు వాళ్ళ టీమ్‌లోకి వెళ్ళిపో.. నేనొక్కడినే చూసుకుంటా నా టీమ్‌ని అని అన్నాడు. దీనికి వర్షిణి కౌంటర్‌గా సమాధానమిస్తూ అసలు నిన్ను తీసేయాలనుకుంటున్నారు ఆల్రెడీ ముసలోవి అయిపోయావంటూ వెళ్ళి తన సీటులో కూర్చుంది. అయితే ఈ మధ్యలో పుల్లలేసే పుల్లారావు యాంకర్ ప్రదీప్ నవయుగ మన్మథుడు అంటూ కొంచె నిప్పుపెట్టగా…నువ్వు బయలుదేరు నీకోసం ఆటో రెడీగా ఉందని చెప్పింది. దీంతో శేఖర్ మాస్టర్ కల్పించుకొని నువ్వు ఒక్కదానివే హ్యండిల్ చేయగలవా అని అడగ్గా.. నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకుంటా, సుధీర్ ఉండి కూడా ఉపయోగం లేదు.. ఇక్కడుండి స్టార్ స్టార్ అంటూ స్టైల్ కొట్టడానికి తప్ప.. దేనికీ పనికిరాడు.. దేనికి పనికి రాడు అంటూ ఎవరూ ఊహించని విధంగా సుధీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది వర్షిణి. దీంతో సుధీర్ చేతిలో మైక్ విసిరేసి స్టేజి ఫై నుండి బయటికెళ్లిపోయాడు. వర్షిణి మాటలవలన సుధీర్ బాధపడి వెళ్లిపోయాడని అంతా అనుకున్నారు. అయితే కొంచెం సేపు తర్వాత మల్లి స్టేజి పైకి వచ్చి నేను యాడకీ పోలా.. అలా దాహమేసే సరికి.. ఇలా మంచి నీళ్ళు తాగి వచ్చానని చెప్పి కామెడీ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో సుధీర్ దానికి పనికిరాడంటూ వ్యాఖ్యలు చేసి.. వర్షిణీ మొత్తం విప్పేసిందంటూ సెటైర్లు వేస్తున్నారు.