టాలీవుడ్ స్టార్ హీరో ,మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేత్ర,రక్తదనాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక ఉద్యోగి భారీ గోల్ మాల్ కు పాల్పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే నగరంలోని చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక ఉద్యోగి ఎంతో కాలంగా విధుల్ల్లో ఉంటున్నాడు.ఈ క్రమంలో దాతలు రక్తదానం చేసిన తర్వాత ఇచ్చే జ్యూస్ ,పండ్లను సమకూర్చే పనులు ఆయన చూస్తున్నాడు.గత నాలుగు ఏండ్లుగా ఆయన ఈ వ్యవహారం మీద బిల్లులను పెంచి చూపిస్తున్నాడు.
అందులో భాగంగా తక్కువ ధరలకు తీసుకొచ్చి అధిక బిల్లులను వేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు అని తెల్సిందే.దీంతో నిర్వాహకుడు స్వామి నాయుడు నగరంలోని జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు .