కాంగ్రెస్, జనసేన పార్టీ ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ మూడు రోజుల రాజకీయ యాత్రపై కాంగ్రెస్ సీనియర్‌నేత హనుమంత్‌రావు పవన్‌పై విమర్శలు చేశారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కూడా స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా సీనియర్ నేత వి.హనుమంతరావు ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తే ఆ పార్టీకి తాను మద్దతు ఇస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వీహెచ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ కు పవన్ చెబితే బాగుంటుందని, కావాలంటే, పవన్ ని రాహుల్ వద్దకు తాను తీసుకెళ్తానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
