మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో వస్తున్న సినిమా టచ్ చేసి చూడు. మూవీ ట్రైలర్ ను యూనిట్ విడుదల చేసింది.జనవరి 26న హీరో రవితేజ పుట్టిన రోజు కావడంతో అభిమానుల కోసం సినిమా యూనిట్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.ఫిబ్రవరి 2న సినిమా విడుదలకానుంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్,వల్లభనేని వంశీ ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ నాయికలుగా నటించారు.
