నా పేరు చిట్టిబాబు అండీ.. ఈ ఊరికి మనమే ఇంజనీర్ అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన రామ్ చరణ్ – సుకుమార్‌ల రంగస్థలం సినిమా టీజర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. సరికొత్తగా రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక రంగస్థలం టీజర్ విడుదల చేసి.. ఆ చిత్రం ఎలా ఉండబోతుందో మనకు కొంత క్లారిటీ ఇచ్చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో చెవిటి వాడనే విషయాన్ని టీజర్‌లో క్లియర్‌గా చెప్పారు. నేనొక సౌండ్ ఇంజినీర్ అంటూ చెర్రితోనే డైలాగ్ చెప్పించాడు సుకుమార్.
ఈ సినిమాకు సంబంధించి మరో విషయం ఏంటంటే అసలు ఈ చిత్రానిక రంగస్థలం అనే టైటిల్ ఎందుకు పెట్టారనే డౌట్ చాలామందిలో ఉండేది. రంగస్థలం అంటే ఎక్కువగా నాటకాలకు సంబంధించినది కావడడంతో.. నాటకాలకు రంగస్థలం అనే టైటల్‌కు సంబంధం ఉందన్నారు కొందరు. ఇంకొందరు రామ్ చరణ్ తన ఇంటికి రంగస్థలం అనే పేరుపెట్టాడని ఊహించుకున్నారు. అయితే ఫైనల్‌గా అదొక ఊరు పేరు అనే విషయం టీజర్‌తో స్పష్టమైంది. గ్రామపంచాయతీ – రంగస్థలం అనే సైన్ బోర్డు కూడా టీజర్‌లో ఉంది.
### రంగస్థలం టీజర్‌లో మనకి మన ఊర్లను గుర్తు చేసే కొన్ని విషయాలు..!
రంగస్థలం సినిమా అంతా గోదావరి జిల్లాలో నడిచే కథే అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక చిట్టిబాబు అయిన రామ్ చరణ్ ఎప్పుడూ ఒక మోటర్‌ని క్యారీ చేయడం… ఆ మోటర్ నడిచేందుకు కిరోసిన్ డబ్బాని తీస్కుని వెళ్తుంటాడు. ఎవరు ఎంత పిలిచినా పలకడు అంటే మనడోకి చెవుడు అని క్లియర్ గా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ భుజం మీద ఎప్పుడూ ఒక తుండుగుడ్డ కనిపిస్తోంది… 1980ల్లో కుర్రాళ్లు ఎక్కువగా ఊళ్లలో ఇలాగే కనిపించేవారు. అలాగే ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో పొలం పనులు చేసే కుర్రాళ్ళు ఇలాగే కనిపిస్తారు.
ఒరేయ్ చిట్టిబాబు అంటూ మనకి జబర్ధస్త్ ఫేమ్ ఆర్టిస్ట్ షేకింగ్ శేషు కనిపిస్తాడు. అంతేకాదు ఈ షాట్ లోనే వెనక మనం తాటికల్లు తీసే వాళ్లని నోటీస్ చేయచ్చు. ఇక మనం రామ్ చరణ్‌ని బాగా అబ్జర్వ్ చేస్తే.. మెడలో ఒక సిల్వర్ కోటెడ్ ఆంజనేయస్వామి దండ, అలాగే సిల్వర్ చెవిపోగుని, చేతికి రాగి కడియాన్ని నోటీస్ చేయొచ్చు. రామ్ చరణ్ రంగస్థలం ఊరిలో నడుచుకుంటూ వెళ్లేటపుడు చేతిలో కిరోసిన్ డబ్బా, వెనకాల అల్లూరి సీతారామరాజు విగ్రహం, అలాగే ఇందిరమ్మ విగ్రహాం… పెంకుటిల్లు, మట్టిగోడలు, తడికలు, పక్కనే మేకలు, వాటికోసం గడ్డిమేత, ఇలా ప్రతి ఒక్కపాయింట్‌ని దర్శకుడు చాలా జాగ్రత్తగా సెట్ చేశాడు.
రామ్ చరణ్ చెక్కబల్ల మీద కూర్చుని టిఫిన్ తినేటపుడు బ్యాక్ గ్రౌండ్‌లో అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని చూడొచ్చు. ఇంటి ముందు ఎండబెట్టిన మిర్చి, సైకల్‌కి కల్లుముంత, మట్టికుండలు, గుమ్మడికాయ, అలాగే ఎద్దులని లాగుతున్న వాతావరణం చాలా అందంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ కత్తిపట్టుకుని నడుస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ గోడలమీద గంగాలమ్మ తల్లి అని రాసి ఉంది. అంతేకాదు, సైడ్‌లో మనకి గ్రామపంచాయితీ రంగస్థలం అని బోర్డ్ కూడా కనిపిస్తుంది. దీనిని బట్టి రంగస్థలం ఊరిలో గంగాలమ్మ జాతర ఉంటుందని అర్ధమవుతోంది. ఇదండీ సుకుమార్ చెక్కిన రంగస్థలం చిత్రం టీజర్ లోని కొన్ని విశేషాలు.