దేశంలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా జరుగూతునే ఉన్నాయి. తాజాగా చిత్రకూట్‌కు చెందిన ఒక మహిళ… ప్రిన్సిపాల్‌పై అత్యాచార ఆరోపణలు చేసింది. సదరు మహిళ ముగ్గురు పిల్లల తల్లి. అలాగే ఆ ప్రిన్సిపాల్ కూడా ముగ్గురు పిల్లల తండ్రి. వీరిద్దరి మధ్య ఏడేళ్ల నుంచి అఫైర్ నడుస్తోంది. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన చిత్రకూట్‌లోని తుర్‌గావ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ మెట్రిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై అత్యాచార ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసు అధికారి శశిసింగ్ మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
