టాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ చెక్కుతున్న రంగస్థలం టీజర్ యూట్యూబ్ రికార్డుల దుమ్ముదులుపుతోంది. మెగా హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రంగస్థలం చిత్రం నుంచి వచ్చిన ఫస్టులుక్ విడుదలై మెగా అభిమానుల్లో జోష్‌ని నింపింది. దీంతో అభిమానులంతా టీజర్ కోసం ఆత్రుతగా ఎదురుచూసారు.. అనుకున్నట్లుగానే తాజాగా టీజర్ అయ్యి ఈ సినిమా పై ఉన్న ఫీవర్‌ని తారాస్థాయికి చేర్చింది.
ఇక ఈ టీజర్ పై మెగా గ్యాంగ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది స్పందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ పై ఎన్టీఆర్ స్పంచించినట్లు తెలుస్తోంది. టీజర్ చూసిన అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ… సిట్టిబాబు క్యారెక్టర్ నేనైతేనా.. కల్లో కూడా ఊహించుకోలేను… వామ్మో చరణ్ లాగా మరోకరు చేయలేరు అనేలా సిట్టిబాబు నటన కనబడుతోందని… తనకి చరణ్ లుక్ చాలా బాగా నచ్చిందని… త్వరలో చరణ్‌తో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని… ఇక సుకుమార్ డైరెక్షన్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతోందని… ప్రతి ప్రేమ్ చాలా బాగా సినిమాని తెరకెక్కించాడని… దేవి బ్యాగ్రౌండ్ అదిరిపోయిందని.. ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు సోషల్ మీడియాలో రెండురోజులుగా హాట్ టాపిక్ నడుస్తోంది.