నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది..36 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న నేతలు రాజీనామా చేశారు. ఏపీలో వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 70రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూళ్ళూరు పేట లో జగన్ పాదయాత్ర చేస్తున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు వైసీపీ అధినేతను కలిశారు
గత నాలుగు ఏండ్లుగా టీడీపీ పార్టీ చేస్తోన్న అవినీతి అక్రమాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో టీడీపీలో ఉండి ఉన్న పేరు ప్రఖ్యాతలను కోల్పోవడం కంటే నీతి నిజాయితీలతో నడుస్తున్న వైసీపీలో చేరి పరువు కాపాడుకోవాలని రామచంద్రారెడ్డి అనుచవర్గం తెలపడంతో ముందుగా తనయుడ్ని జగన్ దగ్గరకు పంపించాడు .జిల్లాలో పాదయాత్ర ముగిసే లోపు భారీ అనుచవర్గంతో టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి రేడిగా ఉన్నారు. ఈ తరుణంలోనే టీడీపీ సీనియర్ నేత, సూళ్ళూరు పేట మున్సిపల్ కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో వైసీపీ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నామని, అయితే పార్టీలో జరిగిన అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. సూళ్లూరుపేటలో తాగునీటిని కూడా ఇప్పించలేకపోయామని సుమంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే సుమంత్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాడని బుధవారం ఓ ప్రత్యేక కథనంతోదురువు.కామ్ ముందుగానే తెలిపింది. దురువు చేప్పిన విదంగానే గురువారం టీడీపీకి రాజీనామా చేశారు.