Home / SLIDER / దావోస్‌లో మంత్రి కేటీఆర్‌..తెలంగాణ‌కు వ‌చ్చేందుకు ప‌లు కంపెనీలు రెడీ

దావోస్‌లో మంత్రి కేటీఆర్‌..తెలంగాణ‌కు వ‌చ్చేందుకు ప‌లు కంపెనీలు రెడీ

తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దావోస్ టూర్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కే తార‌క రామరావు  చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి మూడో రోజు దావోస్లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. దావోస్‌ మహీంద్ర గ్రూపు చైర్మన్ అనంద్ మహీంద్రతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్టం- మహీంద్ర  సంస్ధల మద్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. పలు నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. ముఖ్యంగా వరంగల్ పట్టణంలో టెక్ మహీంద్ర కార్యకలాపాలు ప్రారంభించాలన్న మంత్రి విజ్ఝప్తిని అనంద్ మహీంద్ర, టెక్ మహీంద్ర కంపెనీ సీఈఓ సీపీ గుర్నానీలు అంగీకరించారు.

వరంగల్ పట్టణంలో ఒక టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ముందుగా 500 మందితో ఈ సెంటర్ ఎర్పడుతుందని, భవిష్యత్తులో విస్తరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రెండవ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమను తీసుకుపోయేందుకు చేస్తున్న ప్రయత్నాలను మంత్రి వారికి వివరించారు. ముఖ్యంగా వరంగల్ పట్టణంలో ఉన్న అవకాశాలు, టాలెంట్ పూల్ వంటి అంశాలపైన మంత్రి వివరించారు.  మహీంద్ర సంస్ధ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో రెండవ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమలను తీసుకెళ్లడంలో ప్రేరకంగా పనిచేస్తుందని, ఈ నిర్ణయం తీసుకున్న అనంద్ మహీంద్రకు, సిపి గుర్నానిలకు దన్యవాదాలు తెలిపారు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీ లో జరిగే  అతిపెద్ద స్టార్ట్ అప్  అండ్ టెక్ ఈవెంట్ ను  స్లష్ (SLUSH) ఈ సారి నగరానికి తీసుకొస్తామని హమీ ఇచ్చారు. టి హబ్ ద్వారా నగరం ఇప్పటికే దేశ స్టార్ట్ అప్ కేపిటల్ ఉన్నదని, ఈ కార్యక్రమం నగర స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ కు గొప్ప ఉతం లభిస్తుందని మంత్రి తెలిపారు. త్వరలోనే అనంద్ మహీంద్ర తెలంగాణ ముఖ్యమంత్రి  కె చంద్రశేఖర్ రావును కలువనున్నారు.

ముందుగా సీఏ సంస్థ‌, గ్లోబల్ సియివో మైక్ గ్రెగోరీతో మంత్రి  సమావేశం అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తుందని, నగరంలో తమ కంపెనీ వృద్ది పట్ల తాము పూర్తి సంతృప్తికరంగా ఉన్నామన్నారు. కంపెనీ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల్లో  హైదరాబాద్ నగరానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి విజ్ఝప్తికి గ్రెగరీ సానుకూలంగా స్పందించారు. తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న పలు నగరాలతో పొల్చితే హైదరాబాద్ అత్యుత్తమ నగరమని, ముఖ్యం ట్రాఫిక్, ఏయిర్ పొర్ట్ కనెక్టీవీటీ, చవకైన మౌళిక వసతులున్నాయని గ్రెగరీ నగరంపైన ప్రసంశలు కురిపించారు. ఖచ్చితంగా తమ విస్తరణ ప్రణాళికల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ఫైజర్ వాక్సిన్ అధ్యక్షురాలు సుసాన్ సిలబెర్మన్ తో మంత్రి సమావేశం అయ్యారు.  హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సినేషన్ మ్యాన్యూఫాక్చరింగ్ హబ్బుల్లో ఒకటిగా ఉందని, దాదాపు 25 శాతం ప్రపంచ వ్యాక్సిన్లు ఇక్కడే తయారు అవుతున్నాయని సుసాన్ కు తెలిపారు. నగరంలో ఉన్న జినోమ్ వ్యాలీ, ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మసీటీల గురించి వివరించారు. ఫైజర్ సంస్ధ వాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్ తో ఎర్పాటు చేయాని కోరారు. ఇందుకోసం అవసరం అయిన అధ్యాయనానికి ఫైజర్ బృందాన్ని తెలంగాణకు పంపాలని కోరారు.

ఎయిరో స్సేస్ దిగ్గజం లాక్ హీడ్ మార్టిన్  కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు  రిచర్డ్ అంబ్రోస్ సమావేశం అయ్యారు. సంస్ధ ఇప్పటికే నగరంలో టాటాల భాగస్వామ్యంతో   కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, లాక్ హీడ్ మార్టిన్ స్పేస్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరం అయిన ఈకో సిస్టమ్ ఉందని తెలిపారు. ఈ రంగంలో ఉన్న ఎయిరోస్సేస్  పార్కులు,  మార్స్ అర్బిటర్ ప్రయోగంలో హైదరాబాద్ యంయస్ యంఈల భాగస్వామ్యం వంటి అంశాలను మంత్రి వివరించారు. బల్గేరియా టూరిజం  శాఖ మంత్రి నికోలినా అంగేల్ కోవాతో మంత్రి సమావేశం అయ్యారు. ఇరు ప్రాంతాల మద్య స్టార్ట్ అప్ , ఇన్నోవేషన్, టూరిజం రంగాల్లో ప్రొమోషన్ పైన చర్చించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్ధ ట్రినా సోలార్ ఉపాద్యక్షులు రొంగ్ ఫాంగ్ యిన్,  ఫీలీప్స్ సంస్ద ప్రతనిధులు,  అబ్రాజ్ గ్రూపు మేజేజింగ్ పార్టనర్ కీటో డి బోయర్ లతో పాటు పలు కంపెనీలతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ రోజు మంత్రి దిగ్గజాలను దావోస్ సదస్సులో కలిసారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ , అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్,  హీరో మోటో కార్ప్  సియివో పవన్ ముంజాల్, ఉదయ్ కోటక్, వెల్ స్పన్ గ్రూపు చైర్మన్ బికె గోయెంకా, కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖులను మంత్రి కలిసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat