దావోస్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు . ఆయనతోపాటు మహీంద్రా CEO గుర్నాని కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీ ఆర్ ప్రజంటేషన్ ఇచ్చారు . ఈ సందర్భంగా వరంగల్ నగరంలో టెక్ మహీంద్రా ఏర్పాటుకి ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు . ఈ సెంటర్ ఏర్పాటు వల్ల వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. వరంగల్ లో టెక్ మహీంద్ర సెంటర్ వల్ల రాష్ట్రంలోని ఐటీ స్టూడెంట్స్ ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే లభించే అవకాశం ఉందన్నారు. టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆనంద్ మహీంద్రాకు ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Let me start the day with a piece of good news
Would like to thank @anandmahindra Ji and specially my friend @C_P_Gurnani for agreeing to setup a Tech Mahindra centre in Warangal ? https://t.co/lkP1L6H6uj
— KTR (@KTRTRS) January 25, 2018