కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అదిరిపోయే షాక్ ఇచ్చాడు .వివారాల్లోకి వెళ్ళితే..కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో వున్నాడు.ఈయన ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో కుడా పాల్గొన్నాడు.అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో ..కాంగ్రెస్ పార్టీ కి భవితవ్యం .. ప్రశ్నార్ధకమే అనే స్పష్టత వచ్చింది .ఈ నేపధ్యంలో అయన పార్టీ మరే ఆలోచనలో ఉన్నాడట.
అయితే అధికార టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అంతగా ఏం అభివృద్ధి పనులు చేయక పోవడంతో అయన వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారట.అయితే ఇది గమనించిన మంత్రి లోకేష్ ఎలాగైనా సూర్య ప్రకాష్ రెడ్డిని టీడీపీలోకి లాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపధ్యంలో మంత్రి లోకేష్ స్వయంగా సూర్య ప్రకాష్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారని సమాచారం.అయితే చంద్రబాబు పాలనపై గుర్రుగా వున్నా కోట్ల..లోకేష్ ఫోన్ కాల్ కు తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడట.నేనే వెళ్ళితే రాజన్న తనయుడు జగనన్న పార్టీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకే వెళ్త..నేను మీ పార్టీ లోకి రాను అని మొఖం మీదే చెప్పేశారట.అయితే ప్రస్తుతం లోకేష్ కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి కాల్ చేశాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.