తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరవర్గానికి చెందిన ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు .అసలు విషయానికి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ తలపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హతమార్చారు .
ఆయన నివాసముంటున్న సావర్కర్ నగర్లోని రాత్రి పదకొండు గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ తో గొడవపడ్డారు .అయితే ఈ క్రమంలో స్థానిక కౌన్సిలర్ అయిన మెరుగు గోపి ఎంత సర్ది చెప్పిన కానీ వీరిమధ్య మొదలైన గొడవ సద్దుమణగలేదు .
అయితే ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి శ్రీనివాస్ ను హత్య చేసి మురికి కాలువలో పడేసినట్లు అక్కడి వారు చెబుతున్నారు .ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హైదరాబాద్ నుండి హుటాహుటిన నల్గొండ కు బయలు దేరి వెళ్లారు ..