తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరహాలో త్వరలోనే ఓరుగల్లులో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి తెలిపారు.దీ నికి సంబంధించి రాష్ట్ర ప్రబుత్వం 12 కంపెనీ లతో ఎంవోయూ కుదుర్చుకున్నదన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..74 కిలోమీటర్ల పొడవుతో ఓరుగల్లు మహానగానరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని మంత్రి తెలిపారు.ప్రస్తుతం కాజీపేటలో వున్నా2 లైన్ల ఆర్వోబీనీ 4 లైన్ రోడ్డుగా మారుస్తున్నామని ఈ సందర్బంగా గుర్తు చేశారు. తర్వలోనే వరంగల్‌కు మరో మూడు ఐటీ ప్రాజెక్టులు రాబోతున్నాయని మంత్రి వెల్లడించారు.మెగా టెక్స్‌టైల్ పార్కుతో వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతున్నదన్నారు.