తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండి పడ్డారు.నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతంరావడానికి కారణం కాంగ్రెస్ నేతల అలసత్వమేనన్నారు . పనిచేయడం చేతకాని వారిలా పదవులకు అమ్ముడు పోయి జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.గత 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారు. ఏ ఊరికి వెళ్లినా ప్రజలే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తున్నారని అన్నారు.రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అని ఈ సందర్బంగా సవాల్ విసిరారు.