షాకింగ్.. గల్లా జయదేవ్ అవుట్..!! అవును, నిజమే సూపర్ స్టార్స్ కృష్ణా అల్లుడు, మహేష్ బాబు స్వయాన బావ ఎంపీ గల్లా జయదేవ్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఏకంగా గల్లా జయదేవ్ ఎంపీ స్థానానికి ఎర్త్‌పెట్టనున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఈ వార్త సోసల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక అసలు విషయానికొస్తే.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మహేష్ బాబు మద్దతుతో గుంటూరు ఎంపీగా పోటీచేసి.. తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు గల్లా జయదేవ్. అయితే, 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానం నుంచి గల్లా జయదేవ్‌ను తప్పించి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాకృష్ణ కుమార్తె, స్వయాన చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిని ఎంపీ స్థానంలో పోటీ పెట్టాలని చూస్తోంది టీడీపీ. దీంతో గల్లా జయదేవ్ స్థానానికి టీడీపీ ఎర్త్ పెట్లినట్లయింది.
మరో పక్క ఈ విషయాన్ని కాస్త ముందుగానే గ్రహించిన గల్లా జయదేవ్ తన కార్యాచరణను అమలు పరిచే పనిలో పడ్డారట. అయితే, 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గల్లా జయదేవ్ తల్లి. .గల్లా అరుణకుమారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో చంద్రగిరి నియోజవర్గం నుంచి గల్లా జయదేవ్ ఆ నియోజకవర్గం నుంచే స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌తో.. గల్లా జయదేవ్ అవుట్ అంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.