ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో 23 రోజుల పాటు గజల్ శ్రీనివాస్ జైలులో వున్నా విషయం తెలిసిందే.అయితే ఆయనకు నిన్న (బుధవారం ) బెయిల్ వచ్చింది.ఆ సంతోషంలో తనతోపాటు ఉన్న తోటి ఖైదీల కోరిక కూడా తీర్చారు.వివారాల్లోకి వెళితే గజల్ శ్రీనివాస్ కి బెయిల్ రావడంతో తోటి ఖైదీలు ఆయనను కచేరీ చేయాల్సిందిగా కోరారు. బెయిల్ వచ్చిన సంతోషంలో గజల్ శ్రీనివాస్ కచేరీ చేశారు. 23 రోజులుగా తనతో కలిసి ఉన్న మిత్రులకు వీనుల విందైన గజల్స్ వినిపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషిగా బయటపడతానని ఈ సందర్బంగా చెప్పారు.