ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజా షార్ట్ ఫిల్మ్ జీఎస్టీ రచ్చ కొనసాగుతూనే ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నాడని, అశ్లీలం వైపు యువతను నడిపిస్తున్నాడని వర్మని కొందరు విమర్శిస్తుంటే.. ఫిదా ఫేం గాయిత్రి గుప్తా వర్మని, వర్మ జిఎస్టీ సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వల్ల వర్మ తప్పేమీ చేయడం లేదు.
మన దేశంలో అలాంటివి తీయడం నిషేదం కాబట్టి విదేశాల్లో తీశారు. దాన్ని మన దేశంలోని థియేటర్లలో, యూట్యూబ్ లాంటి వాటిలో విడుదల చేయడం లేదు. పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉండే ఒక డిజిటల్ మార్కెట్‌లో విడుదల చేస్తున్నారు. నచ్చిన వారు చూస్తారు, నచ్చని వారు చూడరు ఇందులో తప్పేముందని ఆమె ప్రశ్నించింది.
రామ్ గోపాల్ వర్మ వల్ల సెక్స్ గురించి మనం అందరూ ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం.. ఆయన వల్ల ఈ అంశంపై ఇంత మార్పు వచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నానని… నాకైతే వర్మతో శృంగారంలో పాల్గొన్నంత ఆనందగా ఉందని.. వర్మ తన ఎథిక్స్‌కు కట్టుబడే ఉన్నారని గాయిత్రి గుప్తా తెలిపింది. దీంతో గాయత్రి గుప్తా పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.. వర్మ కంపెనీలో ఛాన్స్ కోసం గాయత్రి గుప్తా ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉందని అందుకే అతన్ని ఆకాశాకి ఎత్తేస్తోందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.