ఏపీలోని టీడీపీలో రాజకీయం హట్ హట్ గా ఉన్నది. 2019ఎన్నికల్లో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది .ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బంధువులు సైతం మంత్రి అఖిల మాట వినకుండా ఉండడం రాజకీయంగా చర్చనీయంశం అయ్యింది . భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మంత్రి ఏవీ సుబ్బారెడ్డిని ఖాతరు చేయకపోవడంతో ఆళ్లగడ్డలో ఆయన తిష్టవేశారు. తన బలాన్ని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకొని వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
అయితే లేటెస్ట్ సర్వేలో భూమా అఖిలప్రియ ఎక్కడి నుండి పోటి చేస్తాదో అక్కడే ఘోరంగా ఓడిపోతుందని తెలిపింది. అంతేగాక ఆమెకు రాజకీయ అనుభవం, మంత్రి అనుభవం లేదు…ఇటీవల విజయవాడలో పడవ ప్రమాదంతో టీడీపీ నేతలు అందరు అఖిలపై దుమ్మేతి పోశారు…మరోపక్క చంద్రబాబు గట్టిగా వార్నింగ్ కూడ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.భూమా మరణించిన తర్వాత మంత్రి అఖిలప్రియ ఏదో జాలీతో మంత్రిని చేశాడు గాని లేకపోతే అస్సలు మంత్రి పదవి ఇచ్చివారు కాదని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. నంద్యాల్లో భూమా మరణించిన తర్వాత ఉప ఎన్నిక టిక్కెట్ కూడ భూమ ఫ్యామీలీకే ఇవ్వడం వెనుక ఉన్న కారణం… 2019 లో వారికి చెక్ పెట్టాలని చంద్రబాబు ఇలా చేశాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Tags 2019 elactiones allagadda bhuma akhila priya latest surve