ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని ఓట్లు వస్తాయో అనే అంశం మీద ప్రముఖ ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి .ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని సీట్లు ..ఎక్కడ ఎన్ని స్థానాలు దక్కించుకుంటాయో సదరు ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో తేలింది .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి యాబై స్థానాల నుండి అరవై స్థానాల వరకు ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి నూట రెండు స్థానాల నుండి నూట ఐదు స్థానాలు వస్తాయి అని ప్రముఖ జ్యోతిష్యుడు రహీముల్లా ఖాన్ జ్యోష్యం చెప్పాడు .
ఇక పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే వైసీపీ పార్టీ పద్నాలుగు స్థానాలు ,టీడీపీ బీజేపీ పార్టీ కూటమికి 10 స్థానాలు వస్తాయి అని తేల్చి చెప్పాడు .అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణమైన ఉభయ గోదావరి ,కృష్ణా ,గుంటూరు జిల్లాలలో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుంది అని ఆ సర్వేలో తేలింది అని రహిముల్లా తేల్చి చెప్పాడు .చూడాలి మరి ఈ జ్యోష్యం ఎంతవరకు నిజమవుతుందో ..? .