మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్ లానే అంటూ ఉండవల్లి అరున్‌కుమార్‌రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లానే తన పాదయాత్రను కొనసాగిస్తున్నారని, అలాగే. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏదైన మాట ఇస్తే దానిపైనే నిబడేవారని, వైఎస్ జగన్ కూడా వైఎస్ఆర్‌లానే ప్రజా సంకల్ప యాత్రలో అమలుపరిచ గలిగే హామీలను మాత్రమే ప్రజలకు ఇస్తున్నారని చెప్పారు.
ఇక చంద్రబాబు నాయుడు వైఫల్యాలపై ఉండవల్లి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుని కూడా ఏపీకి ఏ ప్రయోజనకరమైన పనిని చేపట్టలేదని నిప్పులు చెరిగారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా ఇలా అన్ని విషయాల్లోనూ చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. అటు చంద్రబాబు వైఫల్యాలను.. ఇటు వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలానే జగన్ వ్యవహార శైలి ఉండటంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలు ముఖ్యమంత్రిగా మొగ్గుచూపుతున్నారని చెప్పారు ఉండవల్లి అరుణ్‌కుమార్.