ఏపీ అధికార టీడీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేకమంది వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నుడి జంప్ అయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అధికార పార్టీలో ఉన్నా.. ఈయనకు ఒక పాత వ్యవహారంలో ఈ వారెంట్ జారీ అయినట్టు సమాచారం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటన.
వెంకటరమణ వైసీపీలో ఉన్న రోజుల్లో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిరసన వ్యక్తం చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారట. దీని పై అప్పట్లోనే కేసు నమోదు అయ్యింది. అనంతర కాలంలో ఈ ఎమ్మెల్యే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అప్పటికే కేసు నమోదై ఉండటంతో..అది కోర్టు వరకూ వెళ్లిపోయింది. విచారణలో భాగంగా కోర్టు పలు సార్లు నోటీసులు జారీ చేసిన ఈ ఎమ్మెల్యే న్యాయస్థానానికి హాజరు కాలేదు. దీంతో.. నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ అయ్యింది. మరి అధికార పార్టీలో ఉండి.. ఆ పార్టీ అధినేత దిష్టిబొమ్మను దహనం చేసిన కేసులో.. ఒక ఎమ్మెల్యే అరెస్టు వారెంట్‌ను ఎదుర్కొంటుడటంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.