సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.ఒక్క మూవీ హిట్ అయితేనే మైమరిచి కింది స్థాయి పైస్థాయి అని తేడా లేకుండా వ్యత్యాసాలు చూపించే నటులున్న నేటి రోజుల్లో కోలీవుడ్ స్టార్ హీరో ,టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ ను సంపాదించుకొని ..ఒక ప్రముఖ అగ్రనిర్మాత కుమారుడని కొంచెం కూడా గర్వం ప్రదర్శించని సూర్య తనకున్న మంచి మనస్సును చాటుకున్నారు.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు స్వచ్చంద కార్యక్రమాలను చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకొని పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
నేటి ఆధునిక రోజుల్లో తమ దగ్గర పనివాళ్ళుగా ఉన్న వారి గురించి ఆలోచిస్తూ తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకునేవారు అతి తక్కువమంది ఉంటారు.నేను అలాంటి వాళ్ళలో ఒకరంటూ నిరూపించుకున్నారు సూర్య .ఎన్నో ఏండ్లుగా తనకు ,తన తండ్రి శివకుమార్ ఇంటి పనుల్లో సహాయంగా పనిచేస్తున్నాడు మురుగన్ .అయితే తిరుపతి లో మురుగన్ వివాహమహోత్సవానికి సూర్య కుటుంబ సమేతంగా హాజరు కావడమే కాకుండా ఏకంగా దగ్గర ఉండి మరి అన్ని పనులను చూస్తూ ఏకంగా కుటుంబ పెద్దగా పెళ్లి కొడుకు చేతికి తాళిని స్వయంగా సూర్య – జ్యోతిక పెళ్లి పెద్దల్లాగా అందించి వహ్వా అనిపించుకున్నాడు .
తన తండ్రి శివకుమార్ – తమ్ముడు కార్తి అందరు కుటుంబ సమేతంగా రావడంతో మురుగన్ పెళ్లి మండపం కళకళలాడింది. దీంతో సూర్య ఫాన్స్ అతని పెద్ద మనసుకి మురిసిపోతున్నారు. ఈ పెళ్ళి వేడుకకి అయిన ఖర్చు మొత్తం సూర్య తనే చూసుకొని వధూ వరులకు కొత్త కాపురానికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పించాడు సూర్య ..