ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత చేపట్టిన చలోరే…చలోరే చల్ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది.యాత్రలో భాగంగా ఇవాళ మూడో రోజు పవన్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్ కు ఖమ్మం విద్యార్ధిని శ్రీజ ఆల్ ద బెస్ట్ చెప్పింది.పవన్ కల్యాణ్ ఆశీస్సులతో మూడేళ్ల క్రితం కేన్సర్ నుంచి శ్రీజ బయటపడిన విషయం తెలిసిందే..శ్రీజ కోరిక మేరకు మూడేళ్ల క్రితం ఖమ్మం వెళ్లి స్వయంగా కూడా ఆమెను పరామర్శించారు. ఈ క్రమంలో ఈరోజు కొత్తగూడెం వచ్చి పవన్ కల్యాణ్‌ను ఆమె కలిసింది.ఈ సందర్బంగా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీజ ఆకాంక్షించగా శ్రీజ ఆరోగ్యంగా ఉండటం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు.
