వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూళ్ళూరు పేట లో జగన్ పాదయాత్ర చేస్తున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు వైసీపీ అధినేతను కలిశారు .అయితే కల్సింది మాములు కార్యకర్త కాదు ఏకంగా టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి .కౌన్సిలర్ కదా అని మాములుగా తీసుకోకండి.ఆయన తండ్రి అయిన వేనాటి రామచంద్రారెడ్డి జిల్లా పరిషత్ టీడీపీ ఫ్లోర్ లీడర్ .
జిల్లాలో నెల్లూరు ప్రాంతంతో పాటుగా సూళ్ళూరు పేట లో వేనాటి కుటుంబానికి మంచి పేరు ఉంది .ప్రజల్లో కూడా మంచి ఆదరణ కూడా ఉంది.అయితే టీడీపీ పార్టీకి ఎన్నో దశాబ్దాలుగా పనిచేస్తున్న కుటుంబం నుండి ఒకరు వైసీపీ అధినేతను కలవడం నెల్లూరు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.అయితే నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించడమే కాకుండా పార్టీకి ఎంతో బలంగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి వైసీపీ అధినేతను కలవడం ఆ కుటుంబం త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు .
అందుకే ముందుగా రామచంద్రారెడ్డి తనయుడు అయిన సుమంత్ రెడ్డి వైసీపీ అధినేతను కలిశారు అని తెలుగు తమ్ముళ్ళు స్వయంగా వ్యాఖ్యానిస్తున్నారు .అయితే ప్రస్తుతం జిల్లాలో పార్టీలో నెలకొన్న పరిస్థితులు ..గత నాలుగు ఏండ్లుగా టీడీపీ పార్టీ చేస్తోన్న అవినీతి అక్రమాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో టీడీపీలో ఉండి ఉన్న పేరు ప్రఖ్యాతలను కోల్పోవడం కంటే నీతి నిజాయితీలతో నడుస్తున్న వైసీపీలో చేరి పరువు కాపాడుకోవాలని రామచంద్రారెడ్డి అనుచవర్గం తెలపడంతో ముందుగా తనయుడ్ని జగన్ దగ్గరకు పంపించాడు .జిల్లాలో పాదయాత్ర ముగిసే లోపు భారీ అనుచవర్గంతో టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి ప్రణాళికలు వేస్తున్నారు అని జిల్లాలో రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి ..