జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మం పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే. అయితే ఈ యాత్రలో గుర్తు తెలియని వ్యక్తి పవన్ పై చెప్పుతో దాడి చేయడం సంచలనంగా మారింది. బుధవారం తెలంగాణలోని కొత్త గూడెం నుండి ఖమ్మంకు భారీ ర్యాలీతో పవన్ కాన్వాయ్ పై ఓ వ్యక్తి చెప్పువిసిరాడు. పవన్ వాహనం తల్లాడ సెంటర్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు.
ఇక ఆ జన సమూహంలో పవన్ పైకి ఓ వ్యక్తి చెప్పు విసిరగా… అయితే అది అదృష్టవశాత్తూ కారు ముందు బానెట్ పై పడడంతో జనసేన అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఖమ్మంలో ఎంబీ గార్డెన్స్‌లో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను ప్రజా సేవకుడిని, ప్రజా పక్షపాతిని. రాజకీయాల్లో కుల, మత, ప్రాంతీయ వాదాలను పక్కన పెట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలని.. అవినీతి పై రాజీలేని పోరాటం చేయాలంటూ కార్య కర్తలకు పిలువునిచ్చారు. సామాజికి మార్పు, తెలంగాణ ఆశయాల కోసం ఆఖరి శ్వాస వరకూ పోరాడతానని పవన్ అన్నారు.