మొదటి భార్యతో విడాకులు అనంతరం సినీ నటి రేణుదేశాయ్ను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వివాహ మాడిన విషయం తెలిసిందే. వీరి వివాహ బంధం కొన్నేళ్లపాటు అన్యోన్యంగా సాగింది. కారణాలు ఏమైనా రేణుదేశాయ్కు విడాకులు ఇచ్చాడు పవన్ కల్యాణ్. ఆ తరువాత విదేశీ మహిళ అన్నా లెజినోవాను పవన్ కల్యాణ్ వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే, ఇటీవల పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్ర ప్రారంభం సందర్భంగా కొబ్బరికాయ కొట్టడం నుంచి పవన్ కు తిలకం దిద్దడం వరకు అన్నీ తానై చూసుకుంది అన్నా లెజీనోవా. ఇప్పుడు ఈ సంఘటనలే రేణుదేశాయ్ను కంటపడి పెట్టేలా చేశాయట. విడాకులు ఇచ్చినంత మాత్రాన రేణుదేశాయ్ ఇప్పటికీ ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే పవన్ కల్యాణ్ జపం చేస్తున్న విషయం జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో అన్నా లెజీనోవా ప్లేస్లో ఊహించుకుంటూ తన సన్నిహితుల వద్ద కంటతడి పెట్టిందంటూ టాలీవుడ్ కోడై కూస్తోంది.