ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ నారా చంద్రబాబు డబ్బుకు ఆశపడి టీడీపీలో చేరారు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు.
అయితే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సర్వేలకు బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం చంద్రబాబు మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో సర్వేను కూడా చేయించారని సమాచారం, చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌కు ముగ్దులైన ముగ్గురు వైసీపీ ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించిన విషయం విధితమే. వారు టీడీపీలో అలా చేరారో లేదో.. అప్పటికే టీడీపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న వారికి, అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో టీడీపీ పార్టీ తరుపున బలం పెంచుకుంటున్న వారికి.. వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చాపకింద నీరులా వార్ నడుస్తోంది. మరోపక్క రిపబ్లిక్ టీవీ చేసిన సర్వేలోనూ ఏపీలో వైసీపీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్న విషయం తెలిసిందే.
అంతేగాక, వైసీపీ పార్టీగుర్తుపై గెలిచి..టీడీపీలో చేరడంపై ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత కోసం తన పార్టీలో ఫిరాయించిన 24 సెగ్మెంట్లలో చంద్రబాబు తన అనుచరవర్గంతో సర్వే చేయించారట. ఈ సర్వేలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దారుణమైన రిపోర్టులు వచ్చాయట. ఈ విషయం కాస్తా తెలిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు అరెరే పార్టీ మారి తప్పు చేశామని ఒకరి గోడు మరొకరితో చెప్పుకుంటూ మనసులో మదనపడుతున్నట్లు సమాచారం.