ఏపీలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో జోరుగా సాగుతున్నది. తాజాగా పట్టణంలోని బాలాజీనగర్‌లోని శ్రీనివాసనగర్ రెవెన్యూ వార్డులో గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని షీ..టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణానగర్‌కు చెందిన లక్ష్మి, వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన మండ్ల మధుసూదన్‌రావు, శరీన్‌నగర్‌కు చెందిన మన్నెపోగు ప్రవీణ్‌కుమార్, రామచంద్రానగర్‌కు చెందిన మంగలి ఉపేంద్ర, విశాఖపట్టణానికి చెందిన పోలవరం భవాని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా కర్నూలు నగరంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు.
నెలకోసారి కాలనీలు మారుస్తూ గుంటూరు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారి ఫొటోలను విటులకు వాట్సాప్‌ల ద్వారా పంపించి రహస్యంగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు షీ–టీమ్స్ ఎస్‌ఐ విజయలక్ష్మి తన సిబ్బందితో మంగళవారం దాడులు నిర్వహించి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. మద్దూర్ నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మహిళా పీఎస్ ఎస్‌ఐ చిన్నపీరయ్య నేతృత్వంలో మంగళవారం దాడి చేసి ముగ్గురు నిర్వాహకులు సయ్యద్, షాహిదాబీ, షేక్ ముబీనా, షేక్ గౌసియాబీతో పాటు విటుడు రమేష్‌ను అరెస్టు చేశారు.