జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణలో చేస్తున్న రాజకీయ యాత్ర పై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ తెలంగాణతో కార్యకర్తల భేటి పెట్టడం వ్యూహాత్మక తప్పిదమని పేర్కొన్నారు. కత్తి ఇలా కామెంట్ చెయ్యగా.. పవన్ మాత్రం తెలంగాణ తల్లి తనకి పునర్జన్మనిచ్చిందని అంటున్నారు.
తెలంగాణకు తానేమి వ్యతిరేకిని కానని.. తాను పుట్టిన తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టం, ప్రేమ అని ఇంకా చెప్పాలంటే ప్రాణం కూడా అని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పసిబిడ్డ లాంటిదని, అటువంటి పసిబిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. అయితే పవన్ చేస్తున్న ఈ పర్యటనపై కత్తి మహేష్ ఓ ట్విట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ అవసరం ఉందని… పవన్ తెలంగాణతో పార్టీ కార్యకర్తల భేటీ మొదలుపెట్టడం ఖచ్ఛితంగా వ్యూహాత్మక తప్పిదమే అంటూ కత్తి ట్విట్ చేశారు.