తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కుల సంఘాల భవనాలు ,భవనాలు ఉన్న వాటికి ప్రహరీ గోడల నిర్మాణానికి ఎనబై లక్షల నిధులు మంజూరు అయినట్లు అన్నారు..నియోజక వర్గ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు ..సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కులాలకు భవనాలు నిర్మించామని తెలిపారు .
అయితే నిర్మించిన వాటికి ప్రహరీ గోడ లేని ప్రహరీ గోడల నిర్మనాణానికి నిధులు మంజూరు చేశామన్నారు….నియోజకవర్గంలో సిద్దిపేట అర్బన్ మండలంలో ని పొన్నాల గ్రామంలో ముదిరాజ్ భవన నిర్మణానికి పది లక్షలు, సిద్దిపేట రూరల్ మండలంలో గుర్రాల్గొంది గ్రామంలో చర్చ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మూడు లక్షలు ,యాదవ భవన నిర్మాణానికి రెండు లక్షలను అందజేశారు .
మరోవైపు ముస్లిం భవన నిర్మాణానికి ఐదు లక్షలు, నారాయణ రావు పేట గ్రామంలో ఎస్సి మాదిగ కమ్యూనిటీ భవన నిర్మాణానికి పది లక్షలు ,చిన్నకోడూర్ మండలంలో అల్లిపూర్ ,గోనెపల్లి ,కస్తూరి పల్లి ,చౌడారం ,రామంచ గ్రామాలలో మహిళ మండలి భవనాలకు ఒక్కో భవనానికి పది లక్షల చొప్పున మొత్తం యాబై లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు..ఈ సందర్భంగా ఆయా గ్రామాల కుల సంఘాల ప్రతినిధులకు మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు…