జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి వచ్చిన తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న శ్రీమంతుడు గుడి వంశీ ధర్ రెడ్డి…గుడి వంశీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మాదారం గ్రామానికి చెందిన గుడి లక్ష్మారెడ్డి – రమాదేవిలకు జన్మించిన కుమారుడు.అయితే తను చిన్న వయస్సులోనే హన్మకొండలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్లో పాఠశాల విద్యనభ్యసి౦చి..నర్సంపేట్ లోని బిట్స్ కళాశాలలో బీటెక్ చదివి అక్కడి నుండి లండన్ వెళ్లి ఎంబీఏ పూర్తి చేసి ఆ తరువాత అమెరికాలో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ పూర్తి చేసి కాంగ్లో మెరిట్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2011 లో ఓ ఐటీ కంపెనీని ప్రారంబించారు.2012లో హైదరాబాద్ మహానగరంలోనూ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేశారు.
అయితే తనకు చిన్న వయస్సు నుండే తనకు జన్మించిన ఊరికోసం ఏదో చెయ్యాలనే తపన.గతంలో ఎటువంటి అభివృద్ధిని నోచుకోని మాదారం గ్రామాన్ని స్వరాష్ట్రంలోనైనా అభివృద్ధి చేసుకోవాలనే ఒక మంచి లక్ష్యం తో గ్రామాని దత్తత తీసుకున్నాడు. దత్తత తీ సుకున్న వెంటనే గ్రామంలోని పాఠశాల తరగతి గదుల మరమ్మత్తు పనులను ప్రారంబిచారు. అలాగే పాఠశాల ఆవరణంలో 150లారీల మొరం పోయించారు.
రెండు లక్షల రూపాయలతో గ్రామంలో మొత్తం ఎల్ఈడీ లైట్లను అందజేశారు.ప్రత్యేకంగా రాజమండ్రి నుండి 2000వేల అందమైన పులా మొక్కలు తెప్పించి గ్రామంలోని మహిళలతో నాటించారు.
గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం చేపించి.60,000 వేలతో ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను పంపిణీ చేసి ,విద్యార్ధులకు బట్టలు ఉచితంగా దుస్తువులు పంపిణీ చేశారు.గ్రామస్తులు కూర్చోవడానికి బెంచీలు వేపించారు.
అలాగే స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో డబల్ బెడ్ రూమ్ లు,రోడ్లు వేపిస్తున్నారు.అంతేకాకుండా మహిళా సమక్య భవనం ,స్మశాన వాటిక కు శంకుస్థాపనలు చేశారు.అలాగే గ్రామంలోని యువత కు ఆటలపోటీ లు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
అంతేకాకుండా నిత్యం ప్రజల్లో వుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ… ప్రజలను చైతన్యవంతులను చేస్తూ అందరికి చేరువతున్నాడు.నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అత్యంత కీలకంగా వ్యహరించడమే కాకుండా ఏకంగా సొంత కంపెనీను మొదలెట్టి అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాడు.ఉద్యమ సమయం నుండి ఉద్యమ పార్టీ ట్,ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన నేతలతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ పార్టీలో అందరి మన్నలను పొందుతున్నాడు.అంతే కాకుండా ప్రస్తుతం నియోజక వర్గ వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యే టి రాజయ్య సహకారంతో ప్రజల సమస్యలను తెల్సుకొని ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కారం జరిగే విధంగా కృషి చేస్తూ ముందుకు పోతూ నియోజక వర్గ ప్రజల్లోనే కాకుండా పార్టీలో కూడా యువనేతగా అందరి మన్నలను పొందుతున్నాడు . అంతేకాదు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు కూడా