ప్రముఖ తిక్క దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సంచలనం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విడుదల జనవరి 26 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయనున్నారు. వర్మ ఈ షార్ట్ ఫిల్మ్ కోసం ఆన్లైన్లో ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటుచేశారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాపై చిత్రీకరించిన ఈ నగ్న వీడియోపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. మియా మాల్కోవా శరీరంలోని ప్రతి అణువును తన కెమెరాతో అత్యద్భుతంగా చూపిస్తానని వర్మ ప్రకటించడంతో ఆ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఆసక్తి మరింత పెరిగిపోయింది. అయితే మియా నగ్నత్వాన్ని పవిత్రంగా చూపిస్తున్నానని, ఇదే తన ఉద్దేశమని తాజాగా వర్మ ట్వీట్ చేశారు.
అత్యంత పవిత్రమైన పద్ధతిలో మియా మాల్కోవా నగ్నత్వాన్ని చూపించాలనే ఉద్దేశంతోనే గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ను నిర్మించాం. ఆమె శరీరంలోని ప్రతి ఒక్క భాగానికి సౌందర్యం పరంగా న్యాయం జరిగేలా తీర్చిదిద్దాం. ఎం.ఎం.కీరవాణి సంగీతం దీన్ని ఆధ్యాత్మకింగా మార్చేసిందని వర్మ ట్వీట్ చేశారు. మొత్తానికి వర్మ ఈ సినిమాతో ఏం చేస్తారో తెలియదు కానీ నగ్నం, శరీరంలో ప్రతి అణువణువు అంటూ ప్రేక్షకుల్లో మాత్రం ఆత్రుతను పెంచేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని యూట్యూబ్లో చూసినట్లు ఉచితంగా వీక్షించడానికి వీల్లేదు. 150 చెల్లించి మియా మాల్కోవా నగ్నత్వాన్ని ఆస్వాదించాలి. ఈ మేరకు గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ను లాంచ్ చేస్తున్న వెబ్సైట్లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. యూఎస్ఏకు చెందిన స్ట్రైక్ ఫోర్స్ ఎల్ఎల్సీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2.99 డాలర్లు అంటే 150 రూపాయలు చెల్లించి హెచ్డీలో వీక్షించొచ్చు.