టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరికి ఏం చేశాడో అందరికీ తెలిసిందే. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి విరగదీస్తా, ప్రశ్నిస్తానని.. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి చంద్రబాబు అడుగుజాడల్లో విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ క్రితమే పార్టీ పెట్టి.. ఆ ఎన్నికల్లో అసలు బరిలోకే దిగకుండా.. జనసేన పక్క పార్టీలకు మద్దతు ఇచ్చింది. పార్టీ పెట్టిన వెంటనే ఎవరైనా అదే ఊపులో బరిలోకి దిగాలని కోరుకుంటారు. అయితే పవన్ అలా కాదు.. పార్టీ పెట్టిన వెంటనే పక్క పార్టీలకు మద్దతు ఇచ్చిన పార్టీ అధ్యక్షుడిగా పవన్ అప్పుడే ఓ రికార్డు కూడా నెలకొల్పారు. 2014 మార్చి 14న పవన్ ఈ జనసేనను ప్రారంభించిన పవన్.. మోడీ,చంద్రబాబులకు మద్దతిచ్చి నాలుగేళ్ళు అయిన తర్వాత కూడా పవన్ పోటీ విషయంలో క్లారిటీ లేకుండా రాజకీయ యాత్రలు అంటూ తిరుగుతున్నారు.
దీంతో ఈ వ్యవహారం అంతా చూస్తుంటే పవన్ కంటే చిరంజీవే బెటర్ అనే వ్యాఖ్యలూ రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి. ప్రజారాజ్యం ఉమ్మడి రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో పోటీచేసినా మొత్తం 18 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీ అలాగే కొనసాగి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అయితే చిరంజీవి పార్టీ నిర్వహణ తనకు సాధ్యంకాదని భావించి.. కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే పవన్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నా.. ఆ శక్తినంతా వృధా చేస్తున్నారని.. చిరంజీవి అయినా ఒక అజెండాతో ముందుకు వెళ్ళారు.. తన వల్ల కాదనుకొని దుకాణం సర్దేశాడు.. పవన్ మాత్రం ఇప్పటికీ సరైన ఎజెండా అంటూ క్రియేట్ చేసుకోకుండా.. ఇప్పటికీ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నాడంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పవన్ వ్యాఖ్యానిస్తూ అభిమానులకు సీట్లు ఇవ్వను అని…ఎన్ని సీట్లలో పోటీచేసేది రెండు నెలల ముందు క్లారిటీ వస్తుంది అని చెప్పటం ద్వారా పవన్ ఏజెండా ఏంటి అనేది స్పష్టంగా తెలిసిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అన్న చిరంజీవి చింపలేనిది.. తమ్ముడు పవన్ వచ్చి పీకుతాడా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.