ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది. 69వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఘనస్వాగతం పలికారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకుని సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు జగన్ కు ప్రజసంకల్పయాత్రకు మద్దతుగా నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో 100 కార్లతో ర్యాలీగా వెళ్ళి స్వాగతం పలుకుతున్నారు.భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో నెల్లూరు జిల్లా నిండిపోయింది.
