Home / Uncategorized / కేంద్ర బడ్జెట్…తెలంగాణ ఏం కోరిందంటే…!

కేంద్ర బడ్జెట్…తెలంగాణ ఏం కోరిందంటే…!

కేంద్ర సార్వత్రిక బడ్జెట్ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసుకుంది. అన్ని రాష్ట్రాలు కూడా తమ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టులకు, వివిధ సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి ఇతోధికంగా రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అంత వరకు ఉన్న పది జిల్లాలను 31 జిల్లాలుగా పునర్విభజించారు. వీటిల్లో 30 జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా, ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధికి రూ.900 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ప్రత్యేక ప్యాకేజీగా వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని కోరింది.

2017-18 సంవత్సరానికి రూ.450 కోట్లు, 2018-19 సంవత్సరానికి రూ.450 కోట్లు కలిపి రూ.900 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని పార్లమెంటు హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఈ విషయాన్ని కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం గుర్తు చేసింది. హైదరాబాద్ మినహా 30 జిల్లాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఒక స్టీలు ప్లాంట్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శటీ, హార్టికల్చర్ వర్శిటీ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇవన్నీ కొత్తగా రాష్ట్రం కోరడం లేదు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లవుతుంది. ఇంత వరకు ఈ దిశగా కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రప్రభుత్వం వీటి ఏర్పాటుకు తగిన స్ధలం ఎంపిక చేసింది. వౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉంది. కేంద్రం అనుమతి రావడమే తరువాయి యుద్ధప్రాతిపదికన రంగంలో దిగేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి మంచి నీటి పథకం కింద మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు దేశంలోని అన్ని రాష్ట్రాల మన్ననలు పొందింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.19205 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం ఇవ్వాలని తెలంగాణ కోరింది. ప్రతిష్టాకరమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి కేంద్రం రూ.10 వేల కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలని ప్రతిపాదించారు. రూ.88 వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే రకరకాల పనుల కింద రూ.22వేల కోట్లను ఖర్చుపెట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, ఉత్తర, దక్షిణ తెలంగాణలో వ్యవసాయ రంగం సస్యశ్యామలమవుతుంది. మిషన్ కాకతీయ ప్రాజెక్టు కింద 45వేల చెరువుల మరమ్మత్తును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాదిన్నరలో పూర్తయ్యేవి.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వ్యవసాయ రంగంలో అనేక రంగాలను పరిధిలోకి తీసుకురావాలని, పశుసంవర్ధక విభాగానికి కూడా ఈ స్కీంను వర్తింప చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని, పన్ను ఎగవేత వేసే ధోరణిని అరికట్టి, పన్నులు చెల్లించే విధంగా హేతుబద్ధీకరణ చేయాలని కేంద్రాన్ని కోరారు. గిరిజన వర్శిటీకి ఏర్పాటుకు సంబంధించి ములుగులో ఐదు వందల ఎకరాలను కేటాయించారు. కేంద్ర బృందం కూడా సందర్శించింది. రాష్ట్రప్రభుత్వం అనేక లేఖలు రాసింది. కాని కేంద్రం నుంచి స్పందన కరవైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్‌ను నెలకొల్పాలని అనేక సార్లు కోరినా కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat