వచ్చే ఉగాది నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.ఇవాళ పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో రూ.16 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంత్రి రాజేందర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తో కలిసి మంత్రి ప్రారంబించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే..కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి, భవిష్యత్ లో పుట్టగతులుండవనే..ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.రామగుండం ఎన్టీపీసీలో మరో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.