నేరం చేయకూడదని అందరికీ తెలుసు.. అంతేకాదు నేరం చేస్తే జైలు శిక్ష పడుతుందనీ తెలుసు.. అయినా చాలా మంది చాలా నేరాల చేస్తూనే ఉన్నారు. అందుకు పోలీసులు తమను కనిపెట్టలేరనే కారణం ఒకటి కాగా, తమ శత్రువులకు వెంటనే విక్ష పడాలనేది మరొక కారణంగా కనిపిస్తోంది. అయితే, దేశ రాజధానిలో ఓ మహిళ చేసిన పనికి పోలీసులే నిర్ఘాంత పోయారు.
ఓ మహిళ తనలోని కన్నింగ్‌ను తన భర్తపైనే చూపించింది. అయితే, ఢిల్లీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వనజ అనే 23 ఏళ్ల యువతి తన భర్త, స్వయాన బావ అయిన అరుణ్‌ను పెళ్లైన ఏడాదికే కానరాని లోకాలకు పంపించింది. ఇక అసలు విషయానికొస్తే.. వనజ, అరుణ్‌కు ఏడాది క్రితం వివాహమైంది. అరుణ్ ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండటంతో తన కాపురాన్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీకే మార్చాడు. అసలు కొత్త జంట కావడంతో అరుణ్, వనజల కాపురం సజావుగా సాగుతోంది. ఇలా ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలోకి అలజడి మొదలైంది.
దీనికి కారణం అపార్ట్‌మెంట్‌లోని తమ ఫ్లాట్ ఎదురుగా ఉన్న శ్రీధర్‌తో వనజ అక్రమ సంబంధమే. ఇలా అరుణ్ ఇంట్లో లేని సమయంలో వనజ శ్రీధర్ ప్రేమ కలాపం కాస్తా ముదిరి పాకాన పడింది. ఈ విషయం కాస్తా పక్క ఫ్లాట్ లో నివాసం ఉంటున్న వారి ద్వారా తెలుసుకున్న అరుణ్ వనజను నిలదీశాడు. దీంతో శ్రీధర్‌పై తన ప్రేమను చంపుకోలేని వనజ.. శ్రీధర్‌తో కలిసి అరుణ్ హత్యకు ప్లానేసింది. అనుకున్నదే తడవుగా అరుణ్ తినే ఆహారంలో విషం కలిపి భర్త అరుణ్‌ను పరలోకాలకు పంపి శ్రీధర్‌కు, తనకు అడ్డును తొలగించుకుంది వనజ. పోలీసుల ఎంట్రీతో వనజ నిజం ఒప్పుకుంది. ఇప్పుడు జైలులో ఊసలు లెక్కపెడుతోంది వనజ.