అవును, అతను రెండు రాష్ట్రాలకు సీఎం అవుతాడట. అయితే, ఇప్పటకే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను అన్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.
ఇంతకీ రెండు రాష్ట్రాలకు సీఎం అవతానన్న ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? అతనే, మన జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.
అయితే, టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కొండగట్టు లో ఉన్న ఆంజనేయ స్వామిను దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు నాయుడు, కేసీఆర్ పరిష్కరించలేని సమస్యలు చాలానే ఉన్నాయని, అవి చాలా సున్నితంతో కూడుకున్నవని చెప్పారు. ఆ సమస్యలన్నింటిని ఇప్పటికే గుర్తించామని, వాటిని త్వరలో రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వారు పరిష్కరించలేని సమయంలో జనసేన మరో అడుగు ముందుకేస్తుందని హెచ్చరించారు.
ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ గురించి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో జనసేన రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని చెప్పారు. ఎన్నికలకు మూడు నెలల గడువు సమయంలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు పవన్. పవన్ ఇలా స్టేట్‌మెంట్ ఇచ్చాడో లేదో.. అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్లు మొదలైపోయాయి. రెండు లడ్డూలూ కావాలా బాబూ.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు.