తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై బంపర్ మెజారిటీతో గెలుపొంది మంథని నియోజకవర్గంలో చరిత్ర సృష్టిస్తున్న మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ,తెలంగాణ ఉద్యమ నాయకుడు ,పుట్ట మధు ఈ ఏడాది జనవరి ఒక్కటి నుండి చేపట్టిన ” మన ఉరు మన ఎమ్మెల్యే ” కార్యక్రమంతో దూసుకపోతున్నాడు .ఈ కార్యక్రమం చేపట్టిన మొదటి రోజునుండి విజయవంతంగా కొనసాగుతుంది.
ఈ కార్యక్రమం ద్వార నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను చెప్పుతుంటే..వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నాడు.రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మన ఉరు మన ఎమ్మెల్యే కార్యక్రమంతో నిత్యం తనను ఎన్నుకున్న ప్రజల మధ్యే వుంటూ..వారి మన్ననలు పొందుతున్నాడు.ఈ కార్యక్రమంలో ఎక్కడికక్కడే బహిరంగ సభలు నిర్వహిస్తూ… ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ..నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజకు అర్ధమయ్యే విధంగా వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ అందరికి చేరువతున్నాడు.
ఈ కార్యక్రమంతో పుట్ట మధుకు అన్ని వర్గాల నుండి లబిస్తున్న ఆదరణను చూసి నియోజకవర్గంలోని ప్రతిపక్ష పార్టీలు కంగారు పడుతున్నాయి.దీంతో వచ్చే ఎన్నికల్లో పుట్ట మధుకే పట్టం కట్టాలని నియోజకవర్గ ప్రజలు నిర్ణయి౦చుకున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి.