తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆలయం నుండి తన రాజకీయ యాత్రను ప్రారంబించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కరీంనగర్ లోని శుభం గార్డెన్లో మూడు జిల్లాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్.. ‘జై తెలంగాణ’ అని నినాదం చేస్తూ, తన ప్రసంగాన్ని ప్రారంబించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ..ఆంధ్రా రాష్ట్రం నాకు జన్మనిస్తే.. తెలంగాణ రాష్ట్రం పునర్జన్మనిచ్చిందన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామీ నన్ను కాపాడారని ఈ సందర్బంగా పవన్ గుర్తుచేశారు. తెలంగాణ నేలతల్లికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. జై తెలంగాణ అంటే ఒళ్లు పులకరిస్తుందని అన్నారు. జనసైనికుల ఉత్సాహం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందన్నారు.
పర్యటనలో భాగంగా ఓ కారు అద్దాలు పగిలాయి. అద్దాలు పగిలిన కారణంగా ఒక అభిమాని కి గాయాలపాలై, చొక్కా అంతా రక్తం నిండింది..ఈ సందర్బంగా పవన్ అతనిని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడి, అతన్ని ఆసుపత్రికి పంపించాలని సూచించారు. తానెంతో ఇష్టపడే అభిమానులకు ఇటువంటి ఘటనలు ఎదురైతే తాను తట్టుకోలేనని అన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఈ సందర్బంగా అభిమానులను కోరారు.