జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రకు బయలుదేరే ముందు.. ఆయన భార్య అన్నా లెజినోవాకు జరిగిన అవమానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే పవన్ తన రాజకీయ యాత్రకు బయలుదేరే ముందు.. ఆయన భార్య హిందూ సాంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి నుదుటున తిలకం దిద్ది… కొబ్బరి కాయ కొట్టి మరీ సాగనంపింది.
అయితే అన్నాలెజినోవాకి అవమానం ఎక్కడ జరిగింది అంటారు.. పవన్ భార్య అన్న లేజినోవ మన దేశానికి చెందిన వ్యక్తి కాదు.. ఆమెకు ఇక్కడి పద్దతులు తెలియవు.. అప్పటికి కొబ్బరికాయ కొట్టే ముందు పవన్ ఆమెకి వివరించి చెప్పాడు.. అయితే పవన్ వాహనం ముందు కొబ్బరి కాయ కొట్టే ప్రయత్నంలో మొదటసారి కొబ్బరికాయ కొట్టగా.. అది పగలకపోవడంతో పవన్‌తో సహా అక్కడ ఉన్నవారంతా నవ్వారు. లేజినోవ కూడా అందరు కొట్టిన కొబ్బరికాయలు పగలడంతో తానూ కొట్టిన కొబ్బరికాయ పగలక పోవడంతో షాక్ తినడంతో పాటు… వారంతా అలా నవ్వేసరికి హర్ట్ అయ్యిందని సమాచారం. దీంతో పవన్ మళ్లీ కొట్టాలని సూచించడంతో ఆమె మరోసారి కొబ్బరికాయ కొట్టింది.. రెండోసారి మాత్రం పగిలింది. ఈ మొత్తం ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.