టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన పీకే అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ,పవన్ చేపట్టనున్న ప్రజాయాత్ర రూట్ మ్యాప్ ,పార్టీ బలోపేతం లాంటి పలు అంశాల గురించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో చర్చించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా నాకు అన్న తమ్ముళ్ళు .
వాళ్ళ అంటే వ్యక్తిగతంగా నాకు ఏమి కోపం కానీ ద్వేషం కానీ లేదు .రాష్ట్ర విభజన సమయంలో ఎవరు నిర్వర్తించాల్సిన పాత్ర వారు సరిగా పోషించలేదనే బాధ మినహా వారంటే నాకు ఎటువంటి కోపం లేదని ఆయన అన్నారు .ఆంధ్రప్రదేశ్ నాకు జన్మనిస్తే తెలంగాణ రాష్ట్రం నాకు పునరజన్మ ఇచ్చింది.నా శ్వాస అగేంతవరకు తెలంగాణకు రుణపడి ఉంటాను అని ఆయన అన్నారు ..