తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.అందులో భాగంగా ఉద్యమ నేత ,రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు రాష్ట్ర వైద్య రంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి అహర్నిశలు కృషిచేస్తున్నారు .
మరోవైపు తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన జడ్చర్ల నియోజక వర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయి వర్గాల వరకు అందేలా ప్రయత్నిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు .పించన్ల దగ్గర నుండి కేసీఆర్ కిట్ల వరకు ,మిషన్ కాకతీయ దగ్గర నుండి ప్రాజెక్టుల వరకు తనదైన స్టైల్ లో కష్టపడుతూ నియోజక వర్గ ప్రజల చేత శబాస్ అనిపించుకుంటున్నారు.ఈ క్రమంలో నియోజక వర్గ వ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు .
అందులో భాగంగా నియోజకవర్గంలో జడ్చర్ల మండలంలో బురెడ్డిపల్లి గ్రామం ,నక్కలబండ తండాలకు చెందిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో గూలబీ గూటికి చేరారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ,మంత్రి నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న పలు ప్రజాభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ..బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి పార్టీ మారుతున్నామని వారు తెలిపారు .ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు .